మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 09/06/2025 సోమవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ లోని ఖమ్మం రోడ్డు ప్రైమరీ స్కూల్ ఎదురుగా సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని రామచంద్రరావు బంజర్ గ్రామ సెక్రటరీ సోనాలి తన మోపిడిపై కల్లూరు వైపు నుండి వి.ఎం బంజర వస్తున్న క్రమంలో వెనుక వైపు నుండి పైపుల లారీ ఢీ కొట్టి మీది నుంచి ఎక్కిపోవడంతో సెక్రటరీ సోనాలి అక్కడికక్కడే మరణించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్