మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 01-05-25 బుధవారం).తల్లాడ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ రైతులందరు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే భూసమస్యలకు పరి ష్కారం లభిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.
భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టంతో సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాలు సైతం భూభారతిలో పరిష్కారం చేసుకోవచ్చన్నారు. జూన్ నెల నుంచి తహసీల్దార్లు మండలంలోని ప్రతీ గ్రామంలో భూభారతి సదస్సులు నిర్వహించి రైతులకు భూసమస్యలపై అవగాహన కల్పించి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతులు తమ భూములను ఆన్ లైన్లో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు.
గతంలో ఏవైనా భూ సమస్యలు వస్తే కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని భూ భారతితో 90శాతం తహసీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని తెలిపారు. లేదంటే ఆర్డీవో,కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. భూసమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టం పై అవగాహనను ఏర్పరచుకోవాలని, దీనిని వూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్, ఆర్డిఓ ,తల్లాడ తాసిల్దార్, మండల అభివృద్ధి అధికారి, స్థానిక ఎస్సై, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు నాయకులు రైతులు, రెవున్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
