మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 01/05/2025 గురువారం). కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం 2025 ను తీసుకువచ్చి ముస్లింల హక్కులను కాల రాసిoదనీ రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ( ఆర్పివి. ఫౌండర్ ) సయ్యద్ సాధిక్ అలి బుధవారం ఆరోపించారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశానుసారం వారికి మద్దతుగా తన నిరసనను తమ సంస్థ చేపట్టిందని అన్నారు.. ముస్లిం మైనార్టీల పట్ల వివక్షతను చూపుతూ ముస్లిం మైనార్టీలను విభజించి పాలించే నైజాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక ఏళ్లుగా ప్రదర్శిస్తూ వస్తుందని ఆయన ఆరోపించారు. ముస్లింల ఐక్యతను చాటుతూ. మనమంతా హమ్ సబ్ ఏక్ హై అంటూ ముస్లిం యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముస్లిం మైనారిటీ యువత తమ కుడి చేతికి నల్ల బ్యాడ్జి ధరించి… మోటారు సైకిల్ ర్యాలీలో పాల్గొనగా ఈ ర్యాలిని సంస్థ ఫౌండర్ సయ్యద్ సాదిక్ అలీ ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు.ఈ ర్యాలీ ఖమ్మం నగరంలో వరంగల్ క్రాస్ రోడ్స్ నుoచి ప్రారంభమైన మోటార్ సైకిల్ ర్యాలి కాల్వ ఒడ్డు, మయూరిసెంటర్ పాత ఎల్ ఐ సి మీదుగా జడ్పీ సెంటర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలు, ప్ల కార్డులు చేతబూని వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం బాధ్యులు డాక్టర్ నజీర్.. రూరల్ మండలం నాయకులు హుస్సేన్ ఇబ్రహీం సోను యాకూబ్ పాషా కుమార్ ఆరిఫ్ తండా హుసేన్ అన్వర్ అబ్దుల్ షాహిద్ షరీఫ్ మోను కాసిం కాజల్ భాష మదర్, 59వ డివిజన్ ఆయేషా సిద్ధికి దానవాయిగూడెం నాయకులు రంజాన్ ఇబ్రహీం ఇఫ్తి కార్ ఆసిఫ్ అఫ్సర్, నాయుడుపేట ప్రాంత నాయకులు ఇబ్రహీం ఖాన్ అబ్బాస్ సోందు అజార్ ఖాసిం, తిమ్మాపురం మండలం నాయకులు సయ్యద్ ద్ బషీర్ , అక్సర్, సుభాన్ , గౌస్మియా మీరా, సైదా మల్సూర్ , బాబు, షబ్బీర్, మీరా, బాబా, సైఫ్, తదితరులు పాల్గొన్నారు.
