మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/04/2025 బుధవారం). తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద బేస్‌మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.
వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన పలువురు లబ్దిదారులకు లక్ష రూపాయల విలువైన చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. 2019 మంది బేస్‌మెంట్ వరకు ఇండ్లను పూర్తి చేసుకోగా వారికి 20.19 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి చెప్పారు.
