మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/04/2025 ఆదివారం) గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా వంగ దామోదర్ గౌడ్ నియామక పత్రం అందజేసిన జిల్లా కమిటీగౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ బలోపేతనం చేసే కార్యక్రమంలో భాగంగా ఐదవ తేదీ శనివారం వి. ఎం బంజరలో ఇ వి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన గౌడ సంఘం మీటింగులో జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం వంగ దామోదర్ గౌడ్ కు నియామక పత్రం అందజేస్తున్న గోపా ముఖ్య సలహాదారులు గుడిద శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బొలగాని శ్రీనివాసరావు గౌడ్ ఉపాధ్యక్షులు పబ్బతి శ్రీనివాసరావు గౌడ్, సింగం జనార్ధన్ గౌడ్ .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక సంఖ్యలో గోపా మెంబర్షిప్ చేపట్టాలని నూతనంగా ఎన్నికైన దామోదర్ కు బాధ్యత అప్పగించి మెంబర్షిప్ పుస్తకాలు అందజేయడం జరిగిందనీ , మండలంలో ఉన్న పేద విద్యార్థులకు, ఆరోగ్య సమస్యలు ఉన్న, లీగల్ సమస్యలున్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా కృషి ఖమ్మం జిల్లాలో త్వరలోనే గౌడ హాస్టల్ నిర్మాణం పూర్తవుతుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పెనుబల్లి గౌడ సంఘం నాయకులు ఈడ కమలాకర్ , వంగ చంద్రశేఖర్ గౌడ్, పంది వెంకటేశ్వర్లు గౌడ్ తదితర గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు.