మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 7/25). రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆదివారం పెనుబల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వి.ఎం బంజార్ గ్రామానికి చెందిన మండలం మహిళా కాంగ్రెస్ నాయుకురాలు బుక్క కృష్ణవేణి ఇంటిలో ఇటీవల బంగారు ఆభరణాలు, నగదు ఇంటిలో ఎవరూ లేని సమయంలో చోరీ చేయబడ్డాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ బుకా కృష్ణవేణిని పరామర్శించి దొంగతనం ఎలా జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మండల పరిధిలోని బయ్యాన్నగూడెం గ్రామంలో చింత వెంకటేశ్వరరావు ఇంటిలో పుష్పాలంకరణ సందర్భంగా చి.ఉదయ మహాలక్ష్మిని, రామచంద్రపురం గ్రామం లో గుండిమెడ విశ్వనాదం కుమారుడు చి.భువన మహేశ్వరీ అన్నప్రాసన వేడుకలో చిన్నారిని ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ కుమార్.

ఈ కార్యక్రమం లో పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పొట్లపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు కరీముల్లా పెనుబల్లి మండలం, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళ యూత్ కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.