మన టివి6 న్యూస్ – రామగుండం (లోకల్ న్యూస్ జూలై 6/25). పెద్దపెల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థకు గత సంవత్సరం నవంబర్ నెల 5వ తేదీన లక్ష్మీ నరసింహ గార్డెన్ ఎన్ టి పి సి యజమాని చింతలపల్లి కిషన్ రావు అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ పై నగరపాలక కమిషనర్ కు సింగం జనార్ధన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశాడు.

అట్టి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎన్నిసార్లు అడిగినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ స్పందించక పోవడంతో అతనిపై జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారికిమరొక ఫిర్యాదు చేశారు. ఇదంతా వివిధ పత్రికలు ప్రచురించడంతో తక్షణమే స్పందించిన అధికారులు గత నెల జూన్ 23 తారీఖున అట్టి కాంపౌండ్ వాల్ కి నోటీసు అంటించారు. టౌన్ ప్లానింగ్ అధికారి చింతలపల్లి కిషన్ రావును ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడంతో కిషన్ రావు తన ఫంక్షన్ హాల్ సిబ్బందితో గేటు , పిల్లర్స్ తొలగించకుండా, సంపూర్ణంగా సిమెంట్ బిళ్ళలు మాత్రమే తొలగించాడు .

ఇట్టి విషయం తెలుసుకున్న సింగం జనార్ధన్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ ని సంప్రదించగా ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు. కానీ వారం గడుస్తున్న ఇప్పటివరకు గేటు, పిల్లర్స్ తొలగించలేదు. ఇలా అసంపూర్తిగా తొలగించడం పట్ల అధికారుల చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిలో ఉన్న అంతర్యం ఏమిటని? మతులబు ఏదో ఉందని ప్రజలకు గుసగుసలాడుకుంటున్నారు.

అదే సామాన్యులు పై ఫిర్యాదు వస్తే అధికారులు ఆగ మేఘాల మీద వెళ్లి హద్దులతో సహా గుర్తించి తొలగిస్తున్నారు. మరి చింతలపల్లి కిషన్ రావు విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావట్లేదని న్యాయవాది సింగం జనార్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా వాటిని పూర్తిగా తొలగించి ప్రజల పట్ల తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లాయర్ జనార్ధన్ అధికారులను కోరుతున్నారు.