మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 14/05/బుధవారం). పెనుబల్లి మండల కేంద్రంలోని బిసి కాలనీ కి చెందిన తోట అంజమ్మ కు (భర్త లేటు ఆంజనేయులు, 45 సం.లు,) ఆమె తన చిన్న కుమారుడు హరికృష్ణ కి అభిప్రాయ బేధాలు రావడంతో 12వ తేదీ సోమవారం మధ్యాహ్నం అంజమ్మ మనస్థాపన చెంది టాబ్లెట్లను మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.
అంజమ్మను పెనుబల్లి ప్రభుత్వాసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కొరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించినారు.
అంజమ్మ పెద్ద కుమారుడైన వంశీ వి ఎం బంజర పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసే విచారణ చేపట్టారు.

Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్