మన టివి6 న్యూస్ – ఖమ్మం ( మన ప్రాంత వార్తలు మనకోసం 14/06/2025 శనివారం). ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి ఆర్థిక సహకారంతో ఖమ్మం పట్టణంలోని గట్టయ్య సెంటర్లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు, నగర అధ్యక్షులు నరాల నరేష్ లతో కలిసి కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఆటో డ్రైవర్లకు యూనిఫాం అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి ఆటో డ్రైవర్ల పై ఉన్న అభిమానంతో వారికి యూనిఫామ్ లు అందజేస్తున్నారు అని, ఈ అవకాశాన్ని ఖమ్మం పట్టణంలోని ఆటో డ్రైవర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Source:mana tv6 news