మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 19/06/2025 గురువారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపైగురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.బోనకల్లు మండలం గార్లపాడు గ్రామానికి చెందిన గుడికందుల కోటేశ్వరావు తల్లి సావిత్రితో కలసి దినోత్సవ వాహనంపై సత్తుపల్లి వెళుతూ ఉండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో సావిత్రి అక్కడికక్కడే మరణించగా కోటేశ్వరరావుకు గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న విఎం బంజర ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి గాయపడిన కోటేశ్వరావును పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.