మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/06/2015 శుక్రవారం). లోక్ సభ ప్రతిపక్ష నేత ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్లో మండల కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు సూచనల మేరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సమక్షంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాధ్, నాయకులు గూడూరు మాధవరెడ్డి, మాలోతు రాధాకృష్ణ, మేకతోట్టి కాంతయ్య, మిట్టపల్లి కిరణ్ కుమార్, ఈడ కమలాకర్, గోగినేని రమేష్, శీలం వెంకటేష్ రెడ్డి, మల్లెల రాజా, గోదా చెన్నారావు, తదితరులు పాల్గొన్నారు.
