google-site-verification: google78487d974c7b676c.html
Devotional

క్షీరసాగరమధన సందర్భంలో మాంగళ్యవివరణ…

15.5KViews

🙏“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో !.

🌿పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

🌹“మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా !
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాంశతం”🌹

🌸ఓ సుభగా ! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.

🌿పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.

🌸భారతావనిలోకి పిండారీలు, థగ్గులు వంటి కిరాతక జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు.

🌿మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు.

🌸అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!