మన టివి6 సిక్స్ న్యూస్ ( బ్రేకింగ్ న్యూస్ మనకోసం 07/02/2025 శుక్రవారం. )
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల పరిధిలోని మండలపాడు గ్రామానికి చెందినటువంటి రావిలాల పవన్ సాయి ని (18 సంవత్సరాలు తండ్రి సాంబశివరావు) ఢీ కొట్టిన డీసీఎం లారీ.
పవన్ సాయి తన సోదరిని స్కూల్ బస్సు ఎక్కించి సందర్భంలో ఢీ కొట్టిన డీసీఎం వ్యాను. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది రాధాకృష్ణ, రమేష్ లు సమయస్ఫూర్తితో వ్యవహరించి గాయపడిన పవన్ సాయిని పెనుబల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. సిహెచ్సిలో ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.

Source:mana tv6 news