మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/03/2025 గురువారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కిచెందిన పాలకుర్తి నాగరాజు (25సంIIలు) అనే యువకుడు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా 6వ తేదీ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న నాగరాజు కి భార్య, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్య కొంతకాలం నుండి భర్తకు దూరంగా ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. ఇద్దరు చిన్నపిల్లలతో నాగరాజుకి ఆర్థిక ఇబ్బందులు పడలేక, కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది తన రెండు చేతులు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహకారంతో 108 కు ఫోన్ చేయటంతో సకాలంలో స్పందించిన 108 సిబ్బంది సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
