మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/02/2025 గురువారం) పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ పాఠశాలను జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నల అడిగారు. వార్షిక పరీక్షల్లోనూ, పోటీ పరీక్షలలో రాసే విద్యార్థులు మానసికంగా చాలా దృఢంగా ఉండి, పరీక్షలు రాయడానికి ప్రిపేర్ కావాలని విద్యార్థులకు తెలియజేశారు.
అన్ని సబ్జెక్టులపై విద్యార్థులకుమంచి అవగాహన ఉండాలని, జిల్లా స్థాయిలో టేకులపల్లి మోడల్ స్కూలుకు మంచి పేరు తేవాలని విద్యార్థులను ఉపాధ్యాయులను కోరారు. మోడల్ స్కూల్ పనిచేసే టీచర్స్ అందరూ విద్యార్థులకు ఆదర్శంగా ఉండే విధంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో కంటే పాఠశాలలో విద్యా ప్రమాణాలు చాలా మెరుగయ్యాయని ప్రిన్సిపల్ రూపస్ ను అభినందిస్తూ, ఇంకా ఉత్తమ ఫలితాలు వచ్చే విధంగా కృషి చేస్తూ, ప్రత్యేక తరగతులను శ్రద్ధగా నిర్వహించాలని సూచించారు.
