మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/02/2025 గురువారం).రిటైర్డ్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టి.పి.టి.యు సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం పెనుబల్లి మండల కేంద్రంలో రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికే 5 డిఏలు బకాయిగా ఉన్నాయని, పిఆర్సి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన కాని, నేటి వరకు అమలు కాలేదని, దానిని వెంటనే అమలు చేయాలని కోరారు.ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ తో కార్పొరేట్ ఆస్పత్రిలో నగదుహిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెంబర్ 317 ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరినీ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా వారి సొంత జిల్లాలకు పంపించాలన్నారు.
ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గురు ప్రసాద్, గౌరవాధ్యక్షులు జి.వి.రామారావు, పుట్టా శ్రీను, రమేష్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
