మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08-01-2025 బుధవారం).
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ . తల్లాడ మండలం లో 7వ తేదీ మంగళవారం నారాయణ పురం, కొడవటిమెట్ట, మంగాపురం, గొల్లగూడెం, పినపాక, వెంకటాపురం, కేశవ పురం, కుర్ణవెల్లి, నారయ్య బంజర్, మిట్టపల్లి, అంజనాపురం మరియు తెలగవరం మొత్తం 27 గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులుస్వయంగా లబ్ధిదారుల చేతికే అందించారు. అలాగే లబ్ధిదారుల కుటుంబ పరిస్థితులను వివరంగా అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ చేపట్టినటువంటి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండలంలోని మొత్తం 27 గ్రామాల్లో 97 సుమారు 35 లక్షలు విలువ కలిగిన చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు అర్జీ పెట్టుకున్న లబ్దిదారులకు అందించారు. ఈ కార్యక్రమం లో తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్, తల్లాడ మండలం కాంగ్రెస్ నాయకులు, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
