మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం).వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నేడు జరిగే మహా ధర్నాను జయప్రదం చేయడానికి పెనుబల్లి మండలం ప్రజా సంఘాల నాయకులు. ఈ సందర్భంగా గాయం తిరుపతి రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోపిడిదారులకు అనుకూలంగా కష్టజీవులకు వ్యతిరేకంగా ఉందని, ఈ క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే పథకాలకు నిధులను తగ్గించి ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని అన్నారు.
మరోవైపు కార్పొరేట్ వర్గాలకు పెట్టుబడిదారులకు సబ్సిడీలు రాయితీలు కల్పించారని, బడ్జెట్ రాబట్టడానికి ప్రజలపై భారాలు వేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆహార భద్రతకు నిధులు తగ్గించి తూట్లు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్ ను సవరించి దేశ ప్రజల ప్రయోజనాలను రాష్ట్రాల అవసరాలను గుర్తించి తగిన విధంగా బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ వివక్షతను మానుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చెమట విశ్వనాథం, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు భూక్య ప్రసాద్, సిఐటియు జిల్లా నాయకులు గుడిమెట్ల బాబు, రైతు కార్మిక యువజన సంఘల నాయకులు కుంజా రాములు, తడికమళ్ళ చిరంజీవి, చలమాల అఖిల్, వెంకటేశ్వరరావు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
