మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి బుర్ర తుకారం గుండె లివర్ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతూ 17వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున హాస్పిటల్ లో మరణించాడు. ఇదిలా ఉండగా వైద్యం కోసం హాస్పిటల్ లో జాయిన్ అవ్వటానికి ముందు తుకారం ఒక వీడియో తీయించుకున్నాడు. ఆ వీడియోలో తను ఏమి చెప్పాడో తెలియాలంటే కిష్టారం లోని అంబేద్కర్ నగర్ ముందు సింగరేణి వాళ్లు రైల్వే వ్యాగిన్సులో బొగ్గును లోడ్ చేయటానికి ఏర్పాటు చేసిన సైలో బంకర్ గురించి తెలుసుకోవాలి. ఈ సైలో బంకర్ ద్వారా రైల్వే వ్యాగన్సులో బొగ్గును నింపటానికి ఏర్పాటు చేసే ప్రక్రియలో ప్రతిరోజు గాలిలోకి కార్బన్ ఉద్గారాలు వెలువడటంతో ఆ గాలిని పీల్చడం వల్ల అంబేద్కర్ కాలనీవాసులు అస్వస్థకు గురవుతున్నారు అనేది కిష్టారం గ్రామస్తుల ఆవేదన. అయితే బుర్ర తుకారం తను తీన్చుకున్న వీడియోలో ఈ సైలో బంకర్ వల్ల గాలి కలుషితం కావడంవల్లనే తన ఆరోగ్యం క్షమించి అస్వస్థకు గురైన అని వివరించడం జరిగింది. ఇకనైనా అధికారులు సింగరేణి యాజమాన్యం స్పందించి ఈ సైలో బంకర్ ను ఇక్కడి నుంచి తీసి మరి ఎక్కడైనా ఏర్పాటు చేయాలని అలాగే అస్వస్థతకు గురై మరణించిన తుకారం కుటుంబాన్ని సింగరేణి ఆదుకోవాలని రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు.
Mana Tv 6 News > Crime News > సైలో బంకర్ కాలుష్యం ద్వారా క్షీణిస్తున్న ప్రజల ఆరోగ్యం.
సైలో బంకర్ కాలుష్యం ద్వారా క్షీణిస్తున్న ప్రజల ఆరోగ్యం.

Source:mana tv6 news
the authorManatv6News_J SRINIVAS REPORTER
All posts byManatv6News_J SRINIVAS REPORTER
You Might Also Like
పెనుబల్లి మండలం లో అస్తిపంజరం కలకలం.
July 21, 2025
గంజాయి ముఠా అరెస్ట్…. పరారీలో ఒకరు.
June 19, 2025
రామాలయంలోకి దూసుకు వెళ్లిన లారీ……
June 14, 2025
రోడ్డు ప్రమాదంలో సెక్రటరీ మృతి
June 9, 2025