మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్న మన తెలంగాణ క్రీడారత్నం, వరంగల్ ముద్దుబిడ్డ, పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా మెరుగైన స్పోర్ట్స్ పాలసీతో ప్రజా ప్రభుత్వం ముందుకుపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

Source:mana tv6 news