మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/05/2015 గురువారం).సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సేవను గుర్తించి పిసిసి ప్రధాన కార్యదర్శిగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.
మహిళా కోటాలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కు ఈ అవకాశం లభించడం చాలా గౌరవప్రదమైన విషయం. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రజాసేవలో నిమగ్నమై ఇటు డాక్టర్ వృత్తికి న్యాయం చేస్తూనే, ఎమ్మెల్యేగా నియోజకవర్గం లో అనునిత్యం ప్రజా సేవకు జీవితాన్ని అంకితమైన డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని మరొకసారి నిరూపించబడింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అనతి కాలంలోనే అరుదైన గౌరవం లభించడంతో కాంగ్రెస్ శ్రేణులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
