మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/04/2025 బుధవారం).ఇందిరమ్మ లబ్ధిదారులు జాబితాలో గృహలక్ష్మి లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని ఈ రోజు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ ముజమ్మిల్ ఖాన్ ని కలసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని, రాజకీయాలకు అతీతంగా కొనుగోలు కేంద్రాలలో రైతులకు సరైన న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.16, 38 సన్నరకం వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని సేకరించాలి, కానీ కొనుగోళ్లు కేంద్రాల్లో 16, 38 సన్నరకం ధాన్యం కొనుగోలు జరగటం లేదు, 16, 38 సన్నరకం ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, మాజీ జెడ్పిటిసి సభ్యులు చక్కిరాల మోహన్రావు, మాజీ పెనుబల్లి మండలం ప్రెసిడెంట్ సంఘం ల అధ్యక్షుడు మందడపు అశోక్ కుమార్ ఉన్నారు.