google-site-verification: google78487d974c7b676c.html
Daily News

చలో ఖమ్మం కరపత్ర ఆవిష్కరణ….

5.52KViews

మన టివి6 న్యూస్ – తల్లాడ మండలం, (మన ప్రాంత వార్తలు మనకోసం 30/05/2025 శుక్రవారం). గిరిజన హక్కుల సాధనకై రాష్ట్ర స్థాయి ఉద్యమ కార్యాచరణ సభను జయప్రదం చేయాలని తల్లాడ మండలం మల్సూర్ తండా గ్రామంలో సంగం సమావేశంలో నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి కరపత్ర ఆవిష్కరణ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్, జిల్లా అధ్యక్షులు నాయక్ దశరథ్ నాయక్.

ఈ కరపత్రంలోని ప్రధాన అంశాలు

👉 తెలంగాణ లో ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో లంబాడీల జనాభా లెక్కలు బహిర్గతం చేయాలి.

👉 గొర్ బోలి భాషను అధికారికంగా గుర్తించి, కేంద్ర ప్రభుత్వం 8వ షెడ్యూల్ లో చేర్చాలి.

👉 ఎస్టిల 10% రిజర్వేషన్ ను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ లో చేర్చాలి.

👉ఎస్టిల రిజర్వేషన్ ను కేంద్ర ప్రభుత్వం 7.5% నుండి 14%నికి పెంచాలి.

👉శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఐచ్చిక సెలవుదినంగా కాకుండా సాధారణ సెలవుదినంగా ప్రకటించాలి.

👉గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, పోడు భూములకు పట్టాలు, లావణి భూములకు పట్టాలు ఇవ్వాలి.

👉 ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ట్రైబల్ వెల్ఫేర్ జిఒఎంఎస్ నెంబర్ 18, 16.07.2024 ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో 100% శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.

👉మైదాన ప్రాంతంలో ఎస్టిల (గిరిజనులు) కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఐటిడిఎ ఏర్పాటు చేయాలి.

👉 నూతనంగా ఏర్పాటైన ఎస్టిల తండాల గ్రామపంచాయితీలను రెవెన్యూ పంచాయితీగా గుర్తించాలి.

👉 ఎస్టిల గ్రామపంచాయితీల అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేయాలి.

👉ఎస్టిల కోసం ఏర్పాటు చేసిన సబ్ ప్లాన్ నిధులను గిరిజనుల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి.

👉ఎస్టిల కోసం కేటాయించబడి పెండింగ్ లో ఉన్న ట్రైకార్ ఋణాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలి.

👉నిరుద్యోగులకు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలి. నిరుద్యోగుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. మొదలగు డిమాండ్ల సాధనకై గిరిజన ప్రజలు, మేధావులు, విద్యార్ధులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలోఖమ్మం జిల్లా అధ్యక్షుడు దశరద్ నాయక్. తల్లాడ మండల అధ్యక్షులు.భూక్య రవి నాయక్, కల్లూరు మండల అధ్యక్షులు నందు నాయక్, భూక్య శీను నాయక్, ధర్మసోత్ శ్రీను నాయక్, బాయి తావు నాయక్, సక్రు నాయక్ లక్ష్మీకాంతి బాయి, రాణి బాయి, రోజా బాయి సంతాలి బాయి, లక్ష్మీ బాయి, రేవతి బాయి. రోజా బాయి, తదితరులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!