మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మన కోసం, 21/01/2025 మంగళవారం).ఒడిశా రాష్ట్రం కోణార్క్‌లో 3వ జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
తెలంగాణ రాష్ట్రం ఖనిజనిక్షేపాలతో సమృద్ధిగా ఉంది 2014లో 1,958 కోట్లు ఉన్న ఆదాయం 2023-24 నాటికి 5,440 కోట్లకు ఖనిజ ఆదాయం పెరిగింది. 32 పెద్ద లైమ్ స్టోన్, మాంగనీసు ఖనిజ బ్లాక్ ల వేలానికి కార్యాచరణ, ఖనిజాలు అనేవి మన రోజువారీ జీవితంలో ప్రధాన మరియు అవసరమైన ముడి సరుకులుగా ఉండి, ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక అభివృద్ధికి కీలకమైనవిగా నిలుస్తాయి..
రాష్ట్రంలో మొత్తం 2,552 మైనింగ్ మరియు ఖనిజ గనుల లీజులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నదితీరంలోని మట్టి, మెట్ట ఖనిజాల కోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పర్యావరణ మరియు ఇతర నియమ నిబంధనలకు అనుగుణంగా అనుమతి తీసుకుని ఇసుకను తవ్వడం, ప్రజలకు పారదర్శకంగా మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తున్నాం..
2024లో సూర్యాపేట జిల్లాలో 2 లైమ్‌స్టోన్ బ్లాక్‌లను వేలం వేసి విజయవంతమైన బిడ్డర్లకు పత్రాలను జారీ చేశాం. చిన్న ఖనిజాల లీజుల మంజూరు విషయంలో, అవసరమైన అనుమతులతో కూడిన బ్లాక్‌ల వేలం విధానాన్ని రాష్ట్రం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఖనిజ వనరుల ఆడిట్ కోసం DGPS సర్వే మరియు ETS సర్వే పూర్తయ్యాయి.