మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). రెండుకాళ్లు పనిచేయకపోవడంతో మంచానికే పరిమితమైన దివ్యాంగుడికి వీల్చైర్ ను వితరణగా అందజేశారు. పెనుబల్లి మండలం పాతకారాయిగూడెం తండాకు చెందిన గుగులోతు భద్రు కు చిన్నతనం నుండి ఒక కాలు పనిచేయకపోయిన కష్టపడి డిగ్రీ పూర్తి చేసి బిఇడి కోర్స్లో జాయిన్ అయ్యాడు. కోర్సు పూర్తిచేసే సమయానికి రెండవ కాలు కూడా చచ్చుపడిపోయి మంచానికే పరిమితం అయ్యాడు. దీనితో పరీక్షలు రాయలేక బిఇడి కోర్సు పూర్తిచేయలేదు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు మంజూరు చేయలేదు. తన భార్య కూలీ కి వెళితేకానీ ఇంట్లో పూటగడవని పరిస్థితి. తనకు వీల్చైర్ అవసరం వుందని మండాలపాడు గ్రామానికి చెందిన జోనేబోయిన అన్నపూర్ణ ని సంప్రదించగా తను నిర్వహించే జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 7వేలు రూపాయలు విలువైన వీల్చైర్ ను శనివారం తన భార్య క్రిష్ణవేణి కి అందజేశారు. తమ కూతురు చదువుకుటుందని ఆర్ధిక స్థోమతలేని తమ కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని కోరారు.
