మన టివి 6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం 13/2/2025 గురువారం). ఖమ్మం రూరల్ మండలం, ఏం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన గుర్రం.వీరబాబు ఇటీవల సాగర్ కాలువ లో పడి మృతిచెందారు. గత కొన్ని నెలల క్రితం అతని భార్య అనారోగ్యం తో మృతిచెందింది. భార్య మృతి చెందడం తో మానసిక వేదనకు గురైన వీరబాబు గత వారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వీరబాబుకు ఇద్దరు సంతానం (కుమారుడు – బబ్లూ 16) (కుమార్తె – ప్రశాంతి 15). తల్లి దండ్రులు కోల్పోవడం తో ఇద్దరు పిల్లలు అనాథలైనారు. విషయం తెలుసుకున్న వీరబాబు కుటుంబాన్ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ వారి ఇంటికి వెళ్లి ఇద్దరు పిల్లల్ని పరామర్శించి, నిత్యవసర సరుకులు అందించి, ఆర్ధిక సహాయం అందజేశారు. వారికి కుటుంబానికి మనోధైర్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి, ఎదులాపురం మున్సిపల్ నాయకులు కళ్లెం.శేష్ రెడ్డి, ఖమ్మం రూరల్ మండల నాయకులు నాగండ్ల.ఉపేందర్, పాపిట్ల.శ్రీను, గ్రామ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, రాజ్ కుమార్, సురేష్, వెంకటేశ్వర్లు, యుగంధర్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
