మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/02/2025 బుధవారం). సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో సింగరేణి బంకర్ వల్ల కాలుష్యం తీవ్రంగా ఉండటం తో కిష్టారం అంబేద్కర్ కాలనీ వాసులు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గత రెండు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు.కిష్టారం అంబేద్కర్ నగరవాసులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వారికి సంఘీభావం తెలియజేశారు.
అనంతరం మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ నేటి ఈ సమస్య కారణం నాటి (మాజి) ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యేనని, ఆరోజు సరైన నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు అంబేద్కర్ కాలనీ వాసులు రోడ్డుపై కూర్చొని నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. సింగరేణి అధికారులు తక్షణమే వీరి సమస్యకు పరిష్కారం చూపించాలని లేకపోతే ఆందోళన విరమించారని సాధ్యమైనంత త్వరగా వీరి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో కిష్టారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అంబేద్కర్ వాసులు పాల్గొన్నారు.