మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 14/02/2025 శుక్రవారం.) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో ఏప్రిల్ 15 వ తేదీ జరగబోయే సంత్ సేవాలాల్ 286 వ జయంతి వేడుకలు పురస్కరించుకొని 13 వ తేదీ గురువారం పెనుబల్లి మండలంలోని గంగాదేవిపాడు గ్రామంలో చంద్రనాయక్ ట్రైబల్ వెల్ఫేర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బానోతు జగన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమరాజు సీతారామరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సంత్ సేవాలాల్ జయంతి నియోజకవర్గ కార్యక్రమాన్ని మన పెనుబల్లి మండలంలో ఘనంగా నిర్వహించాటానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని, ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా బంజారా పెద్దల సహాయ సహకారాలతో సంత సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని సీతారామారావు బంజారా సోదరులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా బంజారా రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ మాట్లాడుతూ బంజారా సోదరులందరూ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. వివిధ గ్రామాలకు చెందిన బంజారా సోదరులు కూడ సంత్ సేవాలాల్ జయంతిని నిర్వహించడానికి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, మండల నాయకులు వివిధ గ్రామ నాయకులు బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు.
