మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 08/04/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం కర్రలపాడు గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కు ప్రజలంతా స్థానిక ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజా ప్రభాకర్ చౌదరి , సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, ఎఒ ప్రసాద్ రావు, ఎఇఒ మండలం కాంగ్రెస్ పార్టీ నాయుకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
