మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 02/04/2025 గురువారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి మండల పరిధిలోని వియ్యం బంజర్ లో ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి గంగదేవిపాడులోని సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడ సోదరులు బహుజన నాయకులు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్పతనాన్ని వీరత్వాన్ని ఒకసారి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండలంలోని గౌడ సోదరులు బహుజన సోదరులు పాల్గొన్నారు.

Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్