మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 04/04/2025). ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి మండలం, కొండ్రుపాడు గ్రామం లో గల రేషన్ షాప్ వద్ద మన ప్రియతమ నాయకురాలు సత్తుపల్లి శాసన సభ్యులు డా”మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమం కొండ్రుపాడు, సూరయ్య బంజార తండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు చేతుల మీదగా పేదలకు పంపిణి చేయటం జరిగింది.
ఈ సందర్బంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డికి, సత్తుపల్లి శాసన సభ్యులు డా మట్టా రాగమయి దయానంద్ కి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా మట్టా దయానంద్ కి కొండ్రుపాడు గ్రామ ప్రజలు తరపున ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొండ్రుపాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు మొరాంపూడి బాబూరావు, యలమంచి శ్రీను, మచినేని మోహనరావు, గరిమళ్ళ వెంకటేశ్వరావు, గౌరయ్య, వాంకుడోత్ కమల జిజ్జరపు వెంకటేశ్వరావు, రాంబాబు కొండ్రుపాడు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
