మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/01/2025 శనివారం.)బి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ ప్రదేశాల్లో, జ్యోతి రావు ఫులే భవన్ లో దరఖాస్తుల స్వీకరణ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో మంత్రుల ద్వారా స్వీకరణ, కల్లెక్టర్ల ద్వార గ్రేవేన్స్ డే లో స్వీకరణ, ఇన్ని విధాలుగా స్వికరించాక – హామీల అమలుకు మాత్రం చేతులు రావట్లేదని అన్నారు. సండ్ర వకట వీరయ్య మాటల్లోనే ప్రధానాంశాలు.
# ఇన్ని లక్షల దరఖాస్తులు వచ్చాక మీరు, పరిశీలించడానికి ఎంత సమయం తీసుకుంటారు.
# ఈ నెల 26వ తారికున తుది జాబితా విడుదల చేస్తాం అని ప్రకటించారు, మరి గ్రామ సభలు అయ్యేదాకా దరఖాస్తులు చేసుకోమన్నారు, మరి వాటిని కూడా దీనిలో చేరుస్తారా!
# సంవత్సర కాలం దరఖాస్తులు తీసుకున్నారు, మరి అమలుకు ఎన్ని సంవత్సరాల కాలం కావాలి. గ్రామ సభల ద్వార మీ చాతకాని తనం బయట పడింది.
#దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం లా మారింది..ఎన్నిసార్లు పేదలు దరఖాస్తులు చేసుకోవాలి. మీ వైఫల్యం తో..గ్రామాల్లో ప్రజలు వర్గాలుగా విడిపోతున్నారు.
#మీ కమిటీ సభ్యులను ఊరికిచ్చి కొట్టారు, ఒక దగ్గర ఆత్మ హత్య ప్రయత్నం చేసారు, ఒక దగ్గర సెల్ టవర్ ఎక్కారు, ఇది పేదవాడి కడుపు మండి జరిగినది. ఇది మీ మిద తిరుగుబాటు కు నిదర్శనం. ప్రతిపక్ష పార్టీ గా ఉండి మేము ఎక్కడ కూడా గ్రామ సభలు వ్యతిరేకించమని పిలుపు నివ్వలేదు, మేము కూడా అవి ప్రశాంతంగా జరగాలి అని అనుకున్నాం, మేము పిలుపు నిచ్చినట్లయితే, ఎక్కడ కూడా ఒక సభ జరగదు, ఇది ప్రజలకు మంచి జరుగుద్దని మేము ఎక్కడ అడ్డుకోలేదు. కానీ మీ భస్మాసుర తలపులు బయట పెట్టుకున్నాక మీరే, ప్రజల ఆగ్రహానికి లోనవుతారని అనుకున్నాం.
ఈ సమావేశం లో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాల (ఆర్ జె సి) కృష్ణ, మాజీ తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, ఖమ్మం మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కర్నాటి కృష్ణమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, రెడ్డెం వీర మోహన్ రెడ్డి, ఖమ్మం టౌన్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు బాదావత్ బాలాజీ, యూత్ నాయకులు బలుసు మురళీకృష్ణ, ఉద్యమకారులు పగడాల నరేందర్ & తదితర నాయకులు పాల్గొన్నారు.