మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12-01-2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. 2024 లో వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో 4,10,931 ఓట్ల మెజార్టీతో లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై నవంబర్ 28న లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా మండల పరిధిలోని విఎం బంజర్ రింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పంది వెంకటేశ్వరరావు, చీకటి రామారావు, ఈడ కమలాకర్, రాజబోయిన కోటేశ్వరరావు, మిట్టపల్లి కిరణ్, గోగినేని రమేష్, మేకతోటి కాంతయ్య, భూక్య ప్రసాద్, మోరంపూడి బాబురావు వంగా దాము, పిల్లి నవజీవన్, ఆళ్ల రాజశేఖర్, గోదా చెన్నారావు తదితరులు పాల్గొన్నారు
