➡️ రైతుల మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
➡️ కింటాకు రూ 25000 ధర నిర్ణయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కొనుగోలు చేయాలి
➡️ ఖమ్మం లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి
➡️ అరుణ ప్రతాప్, గాయం తిరుపతి రావు డిమాండ్.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/02/2025 మంగళవారం).
మిర్చి క్వింటాళ్ల కు 25 వేల రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం పెనుబలి మండల అధ్యక్షుడు నల్లమల అరుణ ప్రతాప్, వ్య.కా.స జిల్లా కమిటీ సభ్యుడు గాయం తిరుపతి రావు డిమాండ్ చేశారు.
నేడు (18 మంగళవారం) ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద రైతుల మహా ధర్నా కార్యక్రమం ప్రచార సందర్భంగా 17 వ తేదీ సోమవారం పెనుబల్లి మండలంలో రంగారావు బంజరలో మిర్చి తోటలను, కల్లాలలో రైతులు ఆరబెట్టిన మిర్చి పంటను పరిశీలించారు. ఒక్కొక్క ఎకరానికి మిర్చి పంటను సాగు చేయటానికి అయ్యే ఖర్చును మిర్చి పంటను సాగు చేసే విధానంలో కలిగే ఇబ్బందులను, సమస్యలను స్వయంగా మిర్చి రైతులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం జరిగే
మహాధర్నా కార్యక్రమాన్ని కి మిర్చి రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం అరుణ ప్రతాప్, గాయం తిరుపతిరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో మిర్చి సాగు అవుతున్న నేపథ్యంలో ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
మిర్చి కింటాకు రూ 25000 ధర నిర్ణయించి ప్రభుత్వం నాఫెడ్, మార్క్ ఫెడ్ సంస్థలు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్ ప్రారంభంలో మిర్చి కింటాకు ఇరవై మూడు వేల రూపాయలు ధర ఉంటే నేడు 12 వేల రూపాయలు ధర కూడా మార్కెట్లో రైతులకు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు ఎక్కువ ఉందని, వైరస్, తెగుళ్లు, నల్లి బారిన పడి మిర్చి దిగుబడి బాగా తగ్గిపోయిందని, మరోవైపు క్వింటా మిర్చి ధర
12 వేలకు పడిపోవడంతో, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు,
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు సంబర రామూర్తి సత్యం నందం రామారావు ఓరుగంటి రామకృష్ణ సంబో జూ వెంకటేశ్వర్లు పడగల సత్యం వెంకన్న మువ్వ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
