google-site-verification: google78487d974c7b676c.html
Daily News

ఖమ్మం జిల్లాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

56.3KViews

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/02/2025 మంగళవారం).
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ‌ జిల్లా పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్ లో కేక్ కటింగ్ హరితహారం మొక్కలు నాటిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్,‌ మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు కేక్ కట్ చేసి కేసిఆర్ కు జన్మదిన వేడుకలు తెలియజేశారు. పార్టీ కుటుంబ సభ్యులంతా కలిసి లాంగ్ లీవ్ కెసిఆర్ అంటూ నినాదాలు చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో బిఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, అందరూ కేక్ కట్ చేసి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వేరే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని, గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లి ప్రచారం చేయాలని, భవిష్యత్తులో రాబోయే రోజులన్నీ మన పార్టీకే అనుకూలంగా ఉంటాయని బిఆర్ఎస్ శ్రేణులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఖమర్,‌ రూరల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, తాళ్లూరి జీవన్ కుమార్, ఉప్పల వెంకట రమణ, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, కార్పొరేటర్లు తోట వీరభద్రం, శీలంశెట్టి వీరభద్రం, మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న, వాచేపల్లి లక్ష్మారెడ్డి, మరియు  నాయకులు సామినేని హరిప్రసాద్, ముత్యాల
వెంకటప్పారావు, వుబ్బలపల్లి నిరోష, సద్దాం షేక్, కృష్ణ ప్రసాద్, మహర్షి, బంక మల్లయ్య, తెలంగాణ ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, పగడాల నరేందర్,  లింగనబోయిన సతీష్, కోడిరెక్క ఉమాశంకర్, నెమలికొండ వంశీ, బురాన్, ఆసిఫ్ అహ్మద్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!