మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 6/25). కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగ కాదు పండగల రైతులకు సహాయసకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో లంకాసాగర్ ప్రాజెక్ట్ నీటిని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ రైతుల అవసరాల కొరకు విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “వరివేస్తే ఉరి” అన్న గత ప్రభుత్వం విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం “వరి వేస్తే సిరి” అనే విధంగా మార్చిందని, ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతులకు విత్తనాలను, యూరియాను ఎక్కడ కొరత లేకుండా అందిస్తూ, రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, వరి పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇలా అనేక రకాలుగా రైతును రాజు చేయడమే ద్యేయంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఇఇ, డిఇ, జెఇ, ఎఇ, పెనుబల్లి, కల్లూరు ఎఎంసి చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, ఖమ్మం అధికార ప్రతినిధి పొట్లపల్లి వెంకటేశ్వరరావు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, చిన్న స్వామి, టేకులపల్లి శ్రీనివాస్ రెడ్డి, సీతారాములు, మాధవ రెడ్డి, లంకాసాగర్ కాంగ్రెస్ నాయకులు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.