మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/05/2015 మంగళవారం).సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మందు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పర్యవేక్షకులు బత్తిని శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణంలో గ్రామస్థాయి నుంచి బూత్ లెవెల్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని అన్ని రకాల కమిటీలు ఏర్పాటుచేసి క్యాడర్ ను పెంచాలని, పట్టణాల మున్సిపాలిటీ స్థాయిలో డివిజన్ల వారీగా అధ్యక్షులు నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి మండలంలో గ్రామ స్థాయిలో అధ్యక్షుడుని నియమించి పార్టీ బలోపేతం చేయాలని, బత్తిని శ్రీనివాసరావు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంపై, నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ నియామాకాలపై పలు సలహాలు సూచనలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నే నమ్ముకొని పార్టీ కష్ట కాలం నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కీ, గెలుపు కోసం కృషి చేసిన పాత సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సమూచిత స్థానం కల్పిస్తాము ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎఎంసి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ లు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చంద్రశేఖర్ రెడ్డి, పెనుబల్లి మండలం అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్, తల్లాడ మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుపతి రెడ్డి, సత్తుపల్లి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, సత్తుపల్లి పట్టణ మాజీ కౌన్సిలర్స్ మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 5 మండలాల ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
