google-site-verification: google78487d974c7b676c.html
Local News

దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి…. చలమాల విఠల్ రావు

కార్మిక చట్టాలను కాలరాయటం చాలా దారుణం....

45.5KViews

మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2015 శనివారం). జూలై 09 న జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు కార్మికులకు పిలుపునిచ్చారు. వి.ఎం. బంజర్ రింగ్ సెంటర్ నందు సిఐటియు మండల కమిటీ జనరల్ బాడీ సమావేశం మండల అధ్యక్షులు తాండ్ర రాజేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ సమావేశానికి చలమాల విఠల్రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విటల్రావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తున్నది తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం చాలా దుర్మార్గమన్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు లేబర్ కోడ్ ల ద్వారా కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేశారని విమర్శించారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తుందని తెలియజేశారు.మోదీ అధికారంలోకి వచ్చిన నుండి కార్పొరేట్ లకు 16 లక్షల 35 వేల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు.కావున కార్మికులు ఐక్య పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై 09 దేశ వ్యాప్త సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కమిటీ సభ్యులు వివిధ యూనియన్ బాధ్యులు గుడిమెట్ల బాబు, మిద్దె స్వామి, అన్నపరెడ్డి లక్ష్మయ్య, జి. వెంకటేశ్వర్లు, కొప్పుల గోవిందరావు, బుడ్డియ్య, దొంతు మాధవ, చందు, కడియం రాజు, ధనలక్ష్మి, కృష్ణ, కాకా సుజాత, రాజకుమారి, లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!