మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2015 శనివారం). ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం వి.ఎం.బంజర గ్రామంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పెనుబల్లి ఆయుష్ డిపార్ట్మెంట్ సిబ్బంది సప్తపది ఫంక్షన్ హాల్ లో ఘనంగా సామూహిక యోగ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వి.ఎం. బంజర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు, పెనుబల్లి సి.హెచ్.సి హాస్పిటల్ సిబ్బంది, లంకాసాగర్ పి.హెచ్.సి సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాల నుండి సప్తపది ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుష్ డిపార్ట్మెంట్ యోగ మాస్టర్ రామకృష్ణ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి మనిషికి నిత్యజీవితంలో ఒక భాగం కావాలని, నిత్యం యోగా సాధన చేసిన వ్యక్తి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని వివరించారు. ఆయుష్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ పెనుబల్లి మండలంలోని ప్రతి ఒక్కరూ పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి ఆయుష్ యోగ
హల్ కి వచ్చి నిత్యం యోగ సాధన చేయగలరని కోరారు.
ఈ కార్యక్రమానికి ఎం.ఇఒ , ఎస్.ఐ,
పెనుబల్లి సి.హెచ్ సి సూపెరండెంట్ డాక్టర్ కిరణ్, స్రవంతి, లంకాసాగర్ పి. హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, యోగ మాస్టర్ శిరీష, అఖిల, ఆయుర్వేద సిబ్బంది నారాణమ్మ , రమ్య, హెల్త్ సూపెవైజర్స్, అశవర్కర్స్, రిటైర్డ్ ఉద్యోగులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
