మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు 15/02/2025 శనివారం). ఎదులాపురం మున్సిపాలిటీ, వరంగల్ క్రాస్ రోడ్, ఆటోనగర్ సమీపంలో గుర్రాలుపాడుకు చెందిన సుమారు పదహారు గొర్రెలు,మేకల అనుమానాస్పదంగా మృతిచెందాయి.
బుర్ర.వెంకన్న, దొడ్డ.ఉపేందర్, దొడ్డ.వీరభద్రం లు గత 10 సంవత్సరాల నుండి గొర్రెలను పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. రోజు వారీ దినచర్య లో భాగంగా గొర్రెలను మేతకు తోలుకొని వచ్చారు. మధ్యహాన సమయంలో సుమారు పదహారు గొర్రెలు, మేకల అనుమానాస్పదంగా మృతిచెందాయి. వీటిలో సుమారు 2,40,000/- రూపాయలు
విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ అక్కడికి చేరుకొని గొర్రెలు కాపర్లను పరామర్శించి, తక్షణమే స్పందించి వెటర్నరీ డాక్టర్ కి ఫోన్ చేసి విషయాన్ని తెలియజేసారు.వెంటనే స్పందించిన డాక్టర్ గొర్రెలకు పంచనామా చేశారు. వీటి మృతికి కారణం అయిన అంశాలను రిపోర్ట్ ద్వారా తెలియచేస్తం అన్నారు. సురేష్ నాయక్ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబురు దయాకర్ రెడ్డికి వివరించారు. దీనికి దయాకర్ రెడ్డి స్పందించి జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకుని, గొర్రెలు కాపర్ల కు సానుభూతి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాలేరు ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎన్.పీ చారి,మధులపల్లి మార్కెట్ డైరెక్టర్ భద్రకాళి,నాయకులు బొల్లం.వెంకన్న,శేష్ రెడ్డి,సత్తార్ మరియు గుర్రలపాడు వాసులు ఉన్నారు.
