google-site-verification: google78487d974c7b676c.html
Daily News

రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన.

48.4KViews

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/04/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల గ్రామస్తులు విఎం బంజర సత్తుపల్లి జాతీయ రహదారి సమీపంలో లంక సాగర్ క్రాస్ రోడ్డుపై బిజెపి సిపిఎం బి.ఆర్.ఎస్ నాయకులు ప్రజలతో కలిసి గురువారం ఉదయం ఆందోళన నిర్వహించారు.

లంకాసాగర్ క్రాస్ రోడ్డు నుండి అడవి మల్లేల గ్రామం వరకు ఉన్న రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా గత రెండు సంవత్సరాల క్రితం పాత రోడ్డు తవ్వ పనులు ప్రారంభించాలని ఇంతవరకు ఆ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో అడవి మల్లేల గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అడివి మల్లేల మాజీ సర్పంచ్ మందడపు అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్డుపై రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారని క్రాస్ రోడ్డు సమీపంలో లంక సాగర్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలలో దుబ్బ పేరుకు పోతుందని, అక్కడ నివసించే వారికి శ్వాసకోశ జబ్బులు వస్తున్నాయని సాధ్యమైనంత త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయాలని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించక పోతే ఒక ప్రాణాలకు బద్ధంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చలమాల విఠల్రావు, బిజెపి నాయకులు మాధవరావు, బొర్రా నరసింహారావు, సామాజిక కార్యకర్త కాటిని శ్రీనివాసరావు, తడికమళ్ళ చిరంజీవి అడవి మల్లెల గ్రామస్తులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!