మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 19/04/2025 శనివారం).పెనుబల్లి మండలం అటవీ ప్రాంతంలోని నీలాద్రి గుడి ప్రాంగణంలో వానరాలకు గత కొన్ని సంవత్సరాలుగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆహారం అందిస్తున్నారు.
18 వ తేదీ శుక్రవారం కూడా నీలాద్రిలోని వానరాలకు ఆహార పదార్థాలు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు అందించారు. విరామ సమయంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు నీలాద్రి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వానరాలకు ఆహార పదార్థాలు అందిస్తున్నారు. ఇలా వానరాలకు ఆహార పదార్థాలు అందించడం తమకు ఎంతో సంతోషంగాను, మనసుకు అహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్యే దయానంద్ దంపతులు తెలియజేశారు. ఎవరి ఇళ్ల వద్ద అయినా ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆహార పదార్థాలు మిగిలిపోయినట్లయితే వారి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వానాలరాలకు అందజేయాలని ప్రజలకు కోరారు.