మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/04/2025 బుధవారం). ఐజేయు రాష్ట్ర వ్యాప్త సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతున్న క్రమంలో, సత్తుపల్లి డివిజన్ పరిధిలో సభ్యత్వ నమోదు సత్తుపల్లి పట్టణ కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ దేవా అధ్యక్షతన ఎనిమిదవ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్కే ఖాదర్ బాబా మాట్లాడుతూ సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వేంసూరు మండలంలో సుమారు 200 పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై ఖాదర్ బాబా వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ప్రింట్ మీడియా ఐజెయూ కార్యదర్శి త్రిమూర్తులు, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవదానం, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షులు సతీష్, ప్రింట్ మీడియా డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, రాంబాబు, అప్పారావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.