మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 14/03/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యనగూడెం గ్రామం వద్ద 14వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన చెరుకూరి పూర్ణచంద్రరావు (60సం.) తిరువూరు నుండి బయ్యనగూడెం గ్రామానికి వచ్చే క్రమంలో జాతీయ రహదారి నుండి బయ్యనగూడెం గ్రామంలోకి వెళుతూ ఉండగా కొత్తగూడెం నుండి విజయవాడ వైపు వెళుతున్న కారు ఢీకొనడంతో గాయాలయ్యాయి. తక్షణమే స్పందించిన స్థానికులు పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాస్పటల్ సిబ్బంది పూర్ణచంద్రరావుకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్