మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/04/2025 బుధవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని సింగరేణి కోటర్స్ లో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ సింగరేణి కోటర్స్ లో 8 ఏళ్లలో దొంగతనానికి పాల్పడి బంగారం, నగదును భారీగా దోచుకున్నారు. సింగరేణి క్వార్టర్స్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ వైర్ కత్తిరించి క్వాటర్స్ లోకి చొరబడి మొత్తం ఎనిమిది ఇళ్లలో సుమారు 35 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను,90 వేల రూపాయల నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు.
ముగ్గురు వ్యక్తులు మోకాల కనిపించకుండా మంకీ క్యాపలు పెట్టుకొని గోడ దూకి క్వాటర్స్లకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సత్తుపల్లి పోలీసులు క్లూస్ టీం సహకారంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.