google-site-verification: google78487d974c7b676c.html
Local News

విద్యార్థులకు పాడ్స్ , మెటీరియల్స్ అందజేసిన సురేష్ నాయక్…..

15.3KViews

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/03/2025 గురువారం).

ఖమ్మం జిల్లా 12వ తేదీ బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ నెల 21 వ తేదీ నుండి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మెటీరియల్స్ ను అందజేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.

ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ  విద్యార్థులు పరీక్షలు రాసే ముందు సంయమనం పాటిస్తూ ప్రశాంతమైన మనసుతో పరీక్షలకు వెళ్లాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు మంచి పేరుతో పాటు, ఎదులాపురం పాఠశాలకు, జిల్లా, రాష్ట్ర స్థాయి లో మంచి గుర్తింపు తేవాలని విద్యార్థినీ విద్యార్థులను కోరారు. పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థు అందరికీ ముందస్తుగా  అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివ కుమారి, ఉపాద్యాయులు   జలంధర్, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు. ప్రద్యుమ్న చారి, ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు శేష్ రెడ్డి,నవీన్, పాఠశాల  ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!