మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు కల్లూరు పట్టణంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేల కేటిఆర్, జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మలను కల్లూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు.
తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వారి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. దళిత స్పీకర్, దళితులను, బీసీలను, చిన్న చూపులు చూడటం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బి.ఆర్.ఎస్ పార్టీ కి అలవాటైన పనేనని, తెలంగాణ వస్తే దళితులను ముఖ్యమంత్రి ని చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని అదే అలవాటు బి.ఆర్.ఎస్ నాయకులు అలవర్చుకున్నారని ఎద్దేవాచేశారు. దళితులు మరియు బీసీ లపై కానీ దళిత బీసీ నాయకుల పైన కానీ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాగం నీరజచౌదరి, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు, ఆలయ కమిటీ చైర్మన్లు మాడిశెట్టి వెంకటేష్, ధారా రంగా, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆలకుంట నరసింహారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు దామాల రాజు, కొర్రా, సేవాదళ్ నియోజవర్గ సభ్యులు పాపబత్తిన నగేష్, సీనియర్ నాయకులు లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యం బాబు, కె.వి. ఆర్, బుక్య శివకుమార్ నాయక్, భాగం ప్రభాకర్ చౌదరి, యాసా శ్రీకాంత్, మాట్టా రామకృష్ణ గౌడ్, ఎనుముల రాము, బొల్లం ఉపేంద్ర గౌడ్ ,మచ్చా వెంకటేశ్వరరావు, మర్సకట్ల బాలచౌరి, కిష్టం శెట్టి కొండలు, దేవరపల్లి వెంకటేశ్వరరావు, వైకుంఠ శ్రీనివాసరావు, దేవరపల్లి శ్రీనివాసరావు, పెదబోయిన నరసింహారావు, బుర్రి వీరయ్య, కీసర మోహన్ రెడ్డి, దళిత నాయకులు పెద్దలు బైర్ల కాంతారావు,నల్లగట్ల పుల్లయ్య,వేము దినాకర్, ఉబ్బన రాంబాబు,పెద్ద బోయిన శ్రీనివాసరావు,నోటి కృష్ణారెడ్డి,పరిమి భరత్, రంగు లక్ష్మణరావు, మాడిశెట్టి శ్రీనివాసరావు, బానోత్ పంతులు, మైనార్టీ నాయకులు తూరాబ్ అలీ, యాకోబ్అలి, ఐయూబ్, పొన్నూరు వెంకటేశ్వరరావు,మాధవ, విజయరావు, నరేష్, రాజు, బానోతు లాల్ సింగ్, కుంచాల గురవయ్య, కుంచాల వీరయ్య, ఓర్సు కృష్ణ, బన్నీ ,యన్.యస్.యు.ఐ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.