మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). ఖమ్మం రూరల్ మండలం, తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై ఇటీవల రాత్రి సమయంలో బి ఆర్ ఎస్ గుండాలు వెనక నుండి చేసిన రాళ్ళ దాడి చేశారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ గాయపడిన కిరణ్ ను పరామర్శించారు. కిరణ్ పై జరిగిన దాడిని సురేష్ నాయక తీవ్రంగా ఖండిస్తూఇది పిరికి పందల చర్యగా భావిస్తున్నామన్నారు. కిరణ్ కు, కుటుంబసభ్యులను మనోధైర్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తక్షణమే దాడి చేసిన బి ఆర్ ఎస్ గుండాలను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ పోలీస్ వారిని కోరతామని సురేష్ నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకులు మద్ది.వీరా రెడ్డి,శేష్ రెడ్డి,నవీన్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
