మన టివి6 న్యూస్ ( మన ప్రాంత వార్తలు మనకోసం 02/04/2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న ఆలోచనతో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బహిరంగ సభ వేదికగా అశేష ప్రజానీకం సమక్షంలో ముఖ్యమంత్రి సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఇదే స్ఫూర్తితో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు చేతుల మీదుగా పెనుబల్లి మండలం ముత్తుగూడెం రేషన్ షాపులో ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో కల్లూరు ఎఎంసి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు మాధవరెడ్డి, సోమరాజు సీతారామారావు, కీసర శ్రీనివాసరెడ్డి ,చీకటి రామారావు, చీకటి చిన్న నరసింహారావు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, బుక్క కృష్ణవేణి, పెనుబల్లి మండలం, చింతగూడెం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, యన్ యస్ యు ఐ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.