google-site-verification: google78487d974c7b676c.html
Breaking News

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం.

57Views

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/03/2025 మంగళవారం).సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి మండలకేంద్రంలో సోమవారం జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమం లో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్. ఈ సందర్భంగా డాక్టర్ మట్ట దానితో మాట్లాడుతూ…”జై బాపు, జై భీమ్, జై సంవిదాన్” అనే నినాదాన్ని మనం అందరంగ్రామ గ్రామానికి తీసుకు పోవాలని తెలియజేసారు. అహింసను ప్రబోధించిన జాతిపిత మహాత్మ గాంధీని, మన హక్కులను మనకు అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని స్మరించుకోవాలని అన్నారు. వారు అందించిన ధర్మాన్ని తప్పకుండా ప్రజలతో పంచుకుంటూ నేడు బిజెపి పార్టీ అవలంబిస్తున్న మతతత్వ విధానాలను తిప్పి కొట్టాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో మన హక్కులను ఎవరు కాలరాయ కూడదని మనందరం కలిసికట్టుగా మన హక్కులపై కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో పోరాట ఉద్యమాన్ని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమరాజు సీతారామారావు, చీకటి రామారావు, కీసర శ్రీనివాస్ రెడ్డి, పొట్లపల్లి వెంకటేశ్వరరావు, బీసీ సంఘం అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, రాజబోయిన కోటేశ్వరావు, గూడూరు మాధవరెడ్డి, కాక వెంకటేశ్వర్లు, బుక్క కృష్ణవేణి, మాలోత్ రాధాకృష్ణ, కావిటి శ్రీను, దొంతు మాధవరావు, పోతురాజు కిషోర్, గాయం శ్రీను, ఆదినారాయణ, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!